CINEMA

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారింది.

అకిరా బర్త్ డే నాడు ఫోటోలు పెట్టమని, తమ అన్న కొడుకును చూసుకోవాలని తమకు ఉండదా? అంటూ అభిమానులు రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ కామెంట్‌కు రేణూ దేశాయ్ కాస్త పరుషంగా రిప్లై ఇచ్చింది. మీ అన్న కొడుకా? అకిరా నా అబ్బాయి అంటూ రిప్లై ఇచ్చింది. అలా నాటి నుంచి నేటి వరకు అభిమానులకు, రేణూ దేశాయ్‌ల మధ్య ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంది.

తండ్రి పేరుతోనే కొడుకుని గుర్తిస్తారు అని, అదే మన సంప్రదాయం అంటూ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వాదించడం. అమ్మ, ఆడదాన్ని గౌరవించడం మన సంస్కృతి, ఇలానే మాట్లాడమని మీ ఇంట్లో వాళ్లు నేర్పించారా? అంటూ రేణూ దేశాయ్ నిలదీయడం జరుగుతూనే వస్తోంది. ఇక రేణూ దేశాయ్‌ తనకు సపోర్ట్‌గా వచ్చిన ఓ వీడియోను షేర్ చేస్తూ ఏడ్చేసింది. రేణూ దేశాయ్‌ని ప్రశ్నించే వారు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు.. ఈ సమాజం ఎందుకు ఎప్పుడు స్త్రీల పట్ల వివక్షను చూపిస్తుందంటూ వచ్చిన ఆ వీడియోను చూసి ఎమోషనల్ అయింది.

ఇక అకిరా విషయంలో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వెనక్కి తగ్గడం లేదు. అకిరా మా పవన్ అన్న కొడుకే అని ఫ్యాన్స్ పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఇక రేణూ దేశాయ్‌ని దాన్నీ దీన్ని అంటూ.. రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయింది.. అందుకే ఎన్నికల సమయంలో ఇలాంటి కామెంట్లు చేస్తోందంటూ రేణూ దేశాయ్‌ని తిడుతున్నారు ఫ్యాన్స్.

Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

నా కొడుకు అంటూ పెంట చేశావ్.. పీకే కొడుకు కాదా? పీకే మాకు దేవుడు.. మా అన్న కొడుకుని చూపించండి అని అంటే తప్పు ఏముంది.. ఎందుకు అంత ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్.. ప్రతీ సారి ఇలా ఎలెక్షన్ టైంలో అపోజిషన్ పార్టీ దగ్గర మనీ తీసుకుంటున్నావా? అకిరా మా అన్న కొడుకు.. మా అన్న పవర్ స్టార్ అని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. దానికి రేణూ దేశాయ్ స్పందించింది. ఇలా పదకొండేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు.. ఆ లాంగ్వేజ్ చూడండి.. ఎలా మాట్లాడుతున్నారు అని రేణూ దేశాయ్ తన అసహనం ప్రదర్శించింది.