CINEMA

ఎన్టీఆర్ 30 : సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే.

దర్శకుడు కొరటాల శివ ఒక్కో అప్డేట్ తో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. ‘ఈ సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే’ అని పోస్టర్ పై రాశారు. పోస్టర్ లో సాగర తీరాన రక్తంతో తడిసిన ఆయుధాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో కొరటాల శివ తన మార్కు చూపిస్తున్నారు. మే 19న ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు.

మార్చి నుండి ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో కొంత చిత్రీకరణ పూర్తి చేశారు. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ మీద పోరాట సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఓ ట్రైన్ ఫైట్ తెరకెక్కించారట. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. గోవా షెడ్యూల్ లో జాన్వీ పాల్గొంటారని సమాచారం.

ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వినికిడి. నిర్మాత బండ్ల గణేష్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే ఆయన రెన్యువల్ చేయించలేదట. దాంతో కొరటాల శివ ఈ టైటిల్ ని ఎన్టీఆర్ 30కి ఫిక్స్ చేశారని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ తో కూడి ఉండే అవకాశం కలదు. విడుదల ఏడాది సమయం మాత్రమే ఉంది. 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు ప్రకటించడం జరిగింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సముద్ర నేపథ్యంలో సాగుతుంది. రాక్షసులను భయపెట్టే వీరుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని కొరటాల అన్నారు. జాన్వీ కపూర్ లుక్ కూడా విడుదల చేశారు. లంగా ఓణీ ధరించి లోతైన భావాలు పలికిస్తూ జాన్వీ లుక్ ఆసక్తిరేపింది. ఆచార్య ఫెయిల్యూర్ తో విమర్శలపాలైన కొరటాల శివ ఎన్టీఆర్ మూవీతో కమ్ బ్యాక్ కావాలని ఆశపడుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.