CINEMA

60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు విలన్..!!

విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి అంటే సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.ఈయన కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు 11 భాషల్లో అంటే తమిళ,మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, భోజపురి, వంటి భాషలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాంటి ఈ నటుడు ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించి నంది అవార్డుని సైతం అందుకున్నారు.

అయితే ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే 60 ఏళ్ల వయసులో అశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూస్తే మీరంతా షాక్ అవుతారు. చూడడానికి ఎంతో అందంగా ఉన్న రూపాలి బరోవా ని ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆశిష్ విద్యార్థి మొదట బెంగాలీ సినీ ఆర్టిస్టు అయినా రాజోషి ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరిద్దరికి పెళ్లయ్యాక కొన్ని రోజులకి ఒక కొడుకు కూడా పుట్టాడు.కానీ కొడుకు పుట్టిన కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య కొన్ని విషయాలలో గొడవలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్నాక ఇన్ని రోజులకి ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) అస్సాం కి చెందిన రూపాలీ బరువా ని రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొద్ది రోజుల నుండి రూపాలీ (Rupali baruva) తో ఆశిష్ విద్యార్థి చాలా సన్నిహితంగా ఉంటూ మెదులుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య అభిప్రాయాలు కలిసి ఈనెల 25న కొద్దిమంది ఫ్రెండ్స్ అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రాండ్ గా డిన్నర్ ఇస్తానని కూడా ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) తెలిపారుట. ఇక ఆశిష్ విద్యార్థి ఈ మధ్యకాలంలో రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్ర లో నటించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి (Pokiri) సినిమా తోనే. ఈ సినిమాలో విలన్ పాత్రలో జీవించారని చెప్పవచ్చు.