CINEMA

మా ఓనర్ మంచు విష్ణు కి ఒకే ఒక్క ప్రశ్న వేస్తోన్న ఇండస్ట్రీ ..

ప్రస్తుతం మా అసోసియేషన్ లో సొంత బిల్డింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

అయితే ఇంతవరకు సొంత బిల్డింగ్ కి పునాది రాయి పడలేదు. ఓ సందర్భంలో తాను నిర్మించడానికి రెడీగా ఉన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. ఆ తర్వాత మా నుంచి కానీ అధ్యక్షుడి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంకా విష్ణు పదవి కాలం ఒక ఏడాది మాత్రమే ఉంది. ఈలోపు బిల్లింగ్ పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. ఈ విషయంలో మాలో ఏం జరుగుతుందో అర్థం కానీ సన్నివేశం కనిపిస్తుంది.

Maa association Manchu Vishnu comments
ఓప్పుడు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మా బిల్డింగ్ కట్టాలని అంటుంటే మరికొంతమంది బిల్డింగ్ అవసరం లేదని , ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి కనీసం 40 కోట్లు అయినా ఖర్చు అవుతుంది. 700 మంది సభ్యులు ఉన్న మా కు 20 మంది ప్యానల్ లో ఉన్నారు. మా మీటింగ్ జరిగితే అందరూ హాజరు అయ్యే పరిస్థితి ఉండదు. అధ్యక్షుడు, అతడి టీంకి రోజు ఆఫీస్ కి వచ్చే పని ఉండదు. కేవలం ఈసీ మీటింగ్ సమావేశాల్లో తప్ప మా బిల్డింగ్ వలన ఉపయోగాలు ఏంటి అన్న వాదన వినిపిస్తోంది.