National

ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్రం బంపర్ ఆఫర్ : మోడీ నేరుగా ప్రకటించాడు !

విభజనతో ఆంధ్ర ప్రదేశ్ చాలా రకంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయింది. పార్లమెంటు సాక్షిగా స్పెషల్ స్టేటస్ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు.

స్పెషల్ ప్యాకేజ్ అనగానే అరకోరా నిధులు మంజూరు చేసినా గాని పెద్దగా రాష్ట్రానికి ఏర్పడ్డ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయలేదని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు…

centers bumper offer to andhra pradesh Narendra Modi announced directly
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం మొదలుకొని పెన్షన్ ఇంకా ప్రజలకు పథకాలు వంటి వాటిపై కేంద్రం పైన ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేటర్ లోకి వెళ్తే కేంద్రం దేశంలో కొత్త ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కడప జిల్లా కొప్పర్తిని ప్రతిపాదించింది. 15 ఆర్థిక సంఘం కొత్త నగరాల అభివృద్ధిపై రాష్ట్రాలకు విధి విధానాలను స్పష్టం చేయడం జరిగింది.