తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా ఈ మధ్య పెళ్లి బాట పడుతున్నారు. శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తర్వాత వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల వివాహం జరగబోతోంది.
ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. తాజాగా ఈ కోవలోనే మరో యంగ్ హీరో రాబోతున్నారు. ఆయనెవరంటే విజయ్ దేవరకొండ.
సినీ పరిశ్రమలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. మహిళల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కొద్దికాలం నుంచి విజయ్ రష్మికతో ప్రేమలో ఉన్నాని, ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, వీరిద్దరూ కలిసి అకేషన్ కోసం వెళ్లారని, రెస్టారెంట్ లో కలుసుకున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాటినుంచి ఇరువైపులా ఎవరూ ఖండించలేదు. దీంతో అభిమానులంతా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. రష్మిక మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచేందుకు దేవరకొండ విజయ్ సిద్ధమవుతున్నారని, వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలవారు ఓకే చెప్పారని, అంతేకాకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ వీరిపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగినప్పటినుంచి వీరిద్దరిని పెళ్లి చేసుకోమంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. ఎంగేజ్ మెంట్ త్వరలోనే జరగబోతోందని, వచ్చే సంవత్సరం వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ఇది నిజమైతే తెలుగు సినీ పరిశ్రమలో మరో ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని చెప్పవచ్చు.