CINEMA

‘చంద్రముఖి 2’.. వినాయక చవివితికి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

స్టార్ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 18 ఏళ్లకు ముందు పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనర్‌లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు.

డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 65వ సినిమా ఇది. అన్‌కాంప్రమైజ్డ్‌గా భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ మాట్లాడుతూ ”ఇండియన్ మూవీ హిస్టరీలో ‘చంద్రముఖి’కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలను మించేలానే మూవీ ఉంటుంది. వినాయక చవతి సందర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.

నటీనటులు:

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్‌, రాధికా శరత్ కుమార్‌, విఘ్నేష్‌, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్‌, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌

సాంకేతిక వర్గం:

దర్శకత్వం: పి.వాసు, బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌, నిర్మాత: సుభాస్కరన్‌, సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, ప్రొడక్షన్ డిజైనర్‌: తోట తరణి, మ్యూజిక్‌: ఎం.ఎం.కీరవాణి, ఎడిటర్‌: ఆంథోని, స్టంట్స్‌: కమల్ కన్నన్‌, రవివర్మ, స్టంట్ శివ, ఓం ప్రకాష్‌, లిరిక్స్‌: యుగ భారతి, మదన్ కర్కి, వివేక్, చైతన్యప్రసాద్‌, కాస్ట్యూమ్స్‌: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైనర్‌: నీతా లుల్లా, దొరతి, మేకప్‌: శబరి గిరి, స్టిల్స్‌: జయరామన్‌, ఎఫెక్ట్స్‌: సేతు, ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, పబ్లిసిటీ డిజైన్‌: ముత్తు, పాయింటర్ స్టూడియో, పి.ఆర్‌.ఒ: యువరాజ్(తమిళ్‌), సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (తెలుగు).