ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీసి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. సినిమా అనగానే భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్..
గుర్తొచ్చే ఈ రోజుల్లో అందుకు పూర్తి భిన్నంగా వెళ్లి ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. హలొ మీరా అనే సినిమా రూపొందించి కేవలం ఒకే పాత్రతో గంటన్నర వినోదం అందించారు. రియాలిటీకి దగ్గరగా ఉండే సన్నివేశాలతో పాటు సింగిల్ క్యారెక్టర్‌తో మ్యాజిక్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
ఏప్రిల్ 21న థియేటర్స్ లో విడుదలైన హలో మీరా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్లలో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించింది. ఈ సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్‌లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించి ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు డైరెక్టర్ శ్రీనివాస్.
ఇక ఈ ప్రయోగాత్మక సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చి అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. వ్యూయర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వ్యూస్ పరంగా జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఓటీటీలో హలో మీరా మూవీ చుసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండటం ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన 15 రోజుల్లోనే 30 మిలియన్ స్ట్రీమింగ్ మినెట్స్ అందుకొని సత్తా చాటింది హలో మీరా సినిమా. IMDbలో 8.3/10 రేటింగ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుండటం చెప్పుకోదగిన విషయం. ఈ సినిమాలోని ఒకే ఒక్క రోల్ గార్గేయి పోషించింది.
సినిమా అంటే పిచ్చి, వ్యామోహం.. సినిమానే జీవితం అంటూ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ఈ హలో మీరాతో తనలోని వైవిధ్యాన్ని చూపించారు. ఈ మూవీకి ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించగా హిరణ్మయి కళ్యాణ్ మాటలు సమకూర్చారు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటం ఆయన కెరీర్ కి పూల బాట వేసిందని చెప్పుకోవచ్చు.