CINEMA

సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను ప్రారంభించిన యాంకర్ సుమ !!!

సుష్మిత జక్కిరెడ్డి గారు ఈరోజు సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను హైదరాబాద్ లో కోకాపెట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుష్మిత జక్కిరెడ్డి మాట్లాడుతూ…
అమెరికాలో నేను బోటిక్ స్టార్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ లభించింది, ఇక్కడ కూడా స్టార్ చేయాలనే ఆలోచనతో సుస్మి సిగ్నేచర్స్ బోటిక్ ను లాంచ్ చెయ్యడం జరిగింది. సుమ గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వడం సంతోషంగా అనిపించింది. గండిపెట్ మెయిన్ రోడ్ కోకాపేట్ లో మా స్టోర్ ను స్టార్ట్ చేశాము. అన్ని రకాల ఔట్ ఫిట్స్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. మా బోటిక్ ద్వారా వచ్చిన రెవిన్యూ లో ఇరవై ఐదు శాతం మా దిశా ఫౌండేషన్ ద్వారా అనాధ పిల్లల సంక్షేమానికి మరియు మహిళా వికాసానికి ఉపయోగించాడం జరుగుతుంది అన్నారు.

సుమ గారు మహిళా వికాసానికి ప్రతీకగా అనిపిస్తారు, ఆమెతో కలిసి కొన్ని సోషల్ సర్వీస్ చెయ్యబోతున్నాను అని తెలిపారు.