ఈ మధ్యే థియేటర్లో రిలీజ్ ఐన భారీ బడ్జెట్ సినిమా ‘పులి-19వ శతాబ్దం’ శనివారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాకు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచాయి. 2022 లో మలయాళంలో వచ్చిన ‘పథోంపథం నూట్టండు’ యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు ‘పులి-19వ శతాబ్దం’ పేరుతో తెలుగు డబ్ అయింది.
సిజు విల్సన్ ఓ యోధుడు. కత్తిని తిప్పడంలో నేర్పరి. 19వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్‌కు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను పట్టుకునే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది. ఈ క్రమంలో చూపించే విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి.
2022లో మలయాళం లో విడుదలైనప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, 4 స్టార్ రేటింగ్‌లు వచ్చాయి. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ గురించి విమర్శకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అద్భుతమని కొనియాడారు. ఈ సినిమాలో నాటి పరిస్థితులు, అంటరానితనం ఎలా ఉండేదో కూడా చూపించారు. వినయన్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. నాని దసరా, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
షాజి కుమార్ సినిమాటోగ్రఫీ, అజయన్ చల్లస్సెరీ వేసిన సెట్స్ అద్భుతమనిపించాయి. ధన్యా భాలకృష్ణన్ కాస్ట్యూమ్స్, వివేక్ హర్షన్ ఎడిటింగ్‌కు కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.