స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు మతులు పోయేలా చేసింది. అందుకు కారణం మిల్క్ బ్యూటీ బెడ్ సీన్లలో నటించడమే. అలా ఎందుకు చేసిందోననే నిజాన్ని తన సోషల్ మీడియాలో ద్వారా తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
గతంలో ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా చేసింది. రెచ్చిపోయి పెర్ఫామెన్స్ చేసింది. గత నెలలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే రెండు సిరీస్‌ల్లో తమన్నా చాలా ఘాటు పెర్ఫామెన్స్ తో అందరినీ షాక్ కు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెబ్ సిరీస్ లో బోల్డ్ నటించడమే అందుకు కారణం.. తమన్నా అలా చెయ్యడం వెనుక ఒక కారణం ఉందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.. అందుకే అలాంటి సీన్లలో నటించిందని వార్త చక్కర్లు కొడుతుంది..
నిజానికి తమన్నా అలా నటించడానికి అసలు కారణం ఏంటనేది అందరి మదిలో మెదులుతున్న ఓ ప్రశ్న.. దానికి తాజాగా సమాధానం దొరికొంది. ప్లానింగ్ ప్రకారమే అలా చేసిందంటూ ఓ న్యూస్ అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చూస్తే.. తమన్నా సీనియర్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్తుండటం.. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం వల్లే అలా చేసిందట.. ఇకపోతే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమను సహజంగా చూపించాలంటే అలాంటి సన్నివేశాలు ఉండటం కీలకమనిపించింది. ఎవరు విమర్శించినా, నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా అలా చూపిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తమన్న మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, తమిళ స్టార్ రజినీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తోంది..