ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నారు. థియేటర్ పని మొత్తం పూర్తయింది. ఈనెల 15వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు.
అమీర్ పేటలోని సత్యం థియేటర్ అంటే ఎంతో ఫేమస్. దీన్ని సర్వ హంగులతో పునర్నిర్మించి AAA సత్యం మల్టీప్లెక్స్ గా ప్రారంభిస్తున్నారు.
ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం 5 స్క్రీన్లున్నాయి. మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తు ఉండబోతోంది.
ఇందులోనే బార్కో లేజర్ ప్రొజెక్టర్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు యాడ్ చేశారు. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఉంది. ఇది కూడా అట్మాస్ సౌండ్ సిస్టంతోనే రాబోతోంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్ తో ఏర్పాటు చేయబడ్డాయి. డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ వీటిల్లో ఏర్పాటు చేశారు. అన్ని స్క్రీన్స్ లో విజువల్ ఫోకస్, డ్రమెటిక్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటాయంటున్నారు.
జూన్ 16న ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది. మొదటి సినిమాగా ఈ మల్టీప్లెక్స్ లో ఆదిపురుష్ ప్రదర్శించబోతున్నారు. థియేటర్ ఓపెన్ చేయకుండానే ప్రజలు చూడటానికి వస్తున్నారని, ఓపెన్ అయిన తర్వాత థియేటర్ దగ్గర పండగ వాతావరణం ఉంటుందంటున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను చేస్తోన్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది