National

జగన్‌ సర్కార్‌పై కేంద్రం కనకవర్షం- మరో రూ.4,787 కోట్లు: తక్షణమే విడుదల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.. కేంద్రం కనకవర్గాన్ని కురిపిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చేయించుకుంటోన్నారు. నిధులను తెప్పించుకుంటోన్నారు.

మీ అభిమానం సల్లగుండ- పాలాభిషేకంతో తడిచి ముద్దయిన తెలంగాణ మంత్రి

రెవెన్యూ లోటు బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి 10,461 కోట్ల రూపాయలను విడుదలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,911 కోట్ల రూపాయలను సైతం యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి.

 

అదే ఊపులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గోదావరిలో వరదల కారణంగా కాఫర్‌డ్యామ్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా 2,000 కోట్ల రూపాయలను సైతం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. ఈ 2,000 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.