National

‘తమిళనాడు ప్రధాని’ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్..

తమిళనాడులోని వేలూరులో తాజాగా పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అలాగే డీఎంకే పార్టీని కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల భేటీలో కీలకవ్యాఖ్యలు చేశారు.

గతంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు నేతల్ని ప్రధాని కాకుండా డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగంగా స్పందించారు.

భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలని అమిత్ షా ఆదివారం తమిళనాడులోని తమ పార్టీ కార్యకర్తలను కోరడంపై స్టాలిన్ స్పందించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తిని ప్రధానిగా చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై స్పందించిన సీఎం స్టాలిన్.. ఆయన “ప్రధాని నరేంద్ర మోడీపై ఎందుకు కోపంగా ఉన్నారు” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఆయన సూచనను స్వాగతిస్తున్నానని, కానీ మోడీపై ఆయన కోపం ఏమిటో తనకు తెలియదన్నారు.

తమిళుడు ప్రధానమంత్రి కావాలనే ఆలోచన బీజేపీకి ఉంటే తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) రూపంలో ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారంటూ స్టాలిన్ అమిత్ షాకు చురకలు అంటించారు.