CINEMA

జపాన్‍లో అదరగొడుతున్న ‘రంగస్థలం’..

మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా టాలీవుడ్‍లో ఓ కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపించింది.

బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. దీంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రామ్‍చరణ్‍తో పాటు హీరోయిన్ సమంత యాక్టింగ్ కూడా ఈ చిత్రానికి ఓ హైలైట్‍గా నిలిచింది. ఏకంగా రూ.200కోట్లకు పైగా కలెక్షన్‍లను సాధించి బంపర్ హిట్ అయింది రంగస్థలం. మాస్ యాక్షన్ మూవీతో డైరెక్టర్ సుకుమార్ తనలోని మరో యాంగిల్ చూపిస్తే.. చిట్టిబాబుగా రామ్‍చరణ్ నట విశ్వరూపాన్ని చూపాడు. కాగా, రంగస్థలం సినిమా ఇప్పుడు జపాన్‍లో విడుదలైంది. జపనీస్ వెర్షన్‍లో శుక్రవారం (జూలై 14) జపాన్‍లోని థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజు కలెక్షన్‍లపై నేడు గణాంకాలు వెల్లడయ్యాయి.

రంగస్థలం సినిమా జపాన్‍లో మంచి ఓపెనింగ్ అందుకుంది. 2023లో జపాన్‍లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా రికార్డు సొంతం చేసుకుంది. టోక్యోలో నగరంలో శుక్రవారం రంగస్థలం చిత్రం 2.5 యెన్స్ కలెక్ట్ చేసిందని సమాచారం. శుక్రవారమే కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు జపాన్‍లో విడుదలైనా.. రంగస్థలమే ఆధిపత్యం చెలాయించింది.