సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో సీక్రెట్ మెయింటెన్ చేస్తారు. కొంతమంది నిర్మాతలు తమ సినిమా బడ్జెట్‌ను కూడా ఇవ్వరు. కానీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) అలా కాదు..
అభిమానులు అడిగే ప్రశ్నలకు తరచూ సమాధానాలు ఇస్తూంటాడు. వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో(The Vaccine War Cinema) బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ను కూడా బయటపెట్టాడు. ఆశ్చర్యకరంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కంటే తక్కువ డబ్బుతో ది వ్యాక్సిన్ వార్ సినిమా సిద్ధమవుతోంది .
12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాతో వివేక్ అగ్నిహోత్రికి పాపులారిటీ పెరిగింది. అయినా కూడా తన తదుపరి చిత్రానికి పెద్దగా ఖర్చు చేయడం లేదు. కేవలం 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనిపై ఆయన ట్వీట్ చేశాడు.
ఒక సినిమా విజయం సాధించిన తర్వాత తదుపరి చిత్రానికి బడ్జెట్ పెంచుతారు. కానీ వివేక్ అగ్నిహోత్రి మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీలైనంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. కంటెంట్ బాగుంటే సినిమా జనాల ఆదరణ పొందడం ఖాయమనేది అతడి ఫార్ములా. తక్కువ బడ్జెట్‌లో సినిమా తీస్తే బాక్సాఫీస్ టెన్షన్ ఉండదు. వివేక్ అగ్నిహోత్రి కూడా అదే ఫాలో అవుతున్నాడు.
ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలో యదార్థ సంఘటన ఆధారంగా ది వ్యాక్సిన్ వార్(The Vaccine War) సినిమాను తీస్తున్నాడు వివేక్ అగ్నిహోత్రి. కరోనా వైరస్(Corona Virus)పై భారతదేశం ఎలా పోరాడిందనేది సినిమా కథ. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై సినీ లవర్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కోవిడ్(Covid) సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. తెలుగు, హిందీతోపాటు ఇంగ్లిష్, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒడియా, పంజాబీ, భోజ్‌పురి భాషల్లో ది వ్యాక్సిన్ వార్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ కూడా ఇందులో నటిస్తోంది.