CINEMA

లాభం చూస్తే దిమ్మ తిరిగిద్ది!

టాలీవుడ్‌లోకి వచ్చి చాలా కాలం అయినా విజయాన్ని అందుకోవడానికి ఇబ్బందులు పడిన హీరోల్లో ఆనంద్ దేవరకొండ ఒకడు. తెరంగేట్రం చేసిన తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా అతడికి హిట్ మాత్రం రాలేదు.

ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసితో ‘బేబి’ అనే యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు.

దీనికి ప్రేక్షకుల నుంచి రికార్డు స్థాయి రెస్పాన్స్ వస్తోంది. దీంతో రెండో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మళ్లీ పుంజుకుంది. మరి ‘బేబి’ మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

క్లిష్టమైన ప్రేమ కథతో వచ్చింది: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లిష్టమైన లవ్ మూవీనే ‘బేబి’. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

 

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: నేటి పరిస్థితులకు తగ్గ కథతో వచ్చిన ‘బేబి’ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

 

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: ‘బేబి’ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9వ రోజూ రికార్డు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 2.33 కోట్లు షేర్, రూ. 4.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.