CINEMA

హాట్ టాపిక్ గా మారుతున్న ఎన్నికలు..!!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తే బిజీగా ఉన్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ ఉంటారు దిల్ రాజ్.

 

టాలీవుడ్ లో ఉండే అగ్ర హీరోల అందరితో కూడా తన బ్యానర్ పైన సినిమాలను చేశారు దిల్ రాజు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. చరణ్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే ఈ రోజున తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా దిల్ రాజు ఆయన తన ప్యానల్ తో కలిసి మీడియాతో మాట్లాడటం జరిగింది.

తాను ఎన్నికలలో గెలిస్తే కిరీటాలు పెట్టారని కొత్త సమస్యలు వచ్చినట్టే అంటూ కూడా తెలియజేశారు.. సినీ పరిశ్రమ అభివృద్ధి సంక్షేమం కోసమే తన ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.. ఇదే సమయంలో అసలైన రాజకీయాలలో కూడా తాను ఏ పార్టీ నుంచి అయినా సరే ఎంపీగా పోటీ చేస్తే గెలిచాతనకు ఉందని కూడా దిల్ రాజు తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి మరి.