CINEMA

నక్క తోక తొక్కిన శ్రీలీల.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్‌.

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది నటులు ఇండస్ట్రీలోకి ముప్పు తిప్పలు పడుతున్నారు.

అయితే అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. వచ్చి రెండేళ్లు కాకముందే శ్రీలీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.

 

ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్న రామ్ చరణ్‌.. తన తదుపరి చిత్రాన్ని `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబుతో చేయబోతున్నాడు. `ఆర్సీ 16` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

 

అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా శ్రీలీలను ఎంపిక చేశారని అంటున్నారు. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా హిట్ ఇచ్చాడు. ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో శ్రీలీల పాల్గొంది. అదే కార్యక్రమానికి బుచ్చిబాబు కూడా హాజరు అయ్యారు. అయితే ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి నా నెక్స్ట్ కాంప్రమైజ్‌ కాకుండా తెలుగు మంచిగా మాట్లాడగల తెలుగు అమ్మాయిని హీరోయిన్‌ తీసుకుంటాను అంటూ శ్రీలీల వైపు చూశారు. దాంతో ఆమె కూడా ముసి ముసి నవ్వులు నవ్వడంతో.. ఇప్పటికే వీరి కాంబో సినిమా కన్ఫర్మ్‌ అయిందని ఓ క్లారిటీ వచ్చింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒక్కటే రావాల్సి ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు శ్రీలీల నక్క తోక తొక్కింది.. అదృష్టం ఆమె ఆమెదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.