CINEMA

బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు

బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ వివాహం ఈనెల 18న ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ్ మూడుముడులు వేశాడు.

హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో చాలా మంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం కొత్త కోడలు పేరు ఐశ్వర్య. ఈమె ప్రముఖ డైరెక్టర్, ఐవిఎఫ్ స్పెషలిస్ట్ పద్మజ వినయ్ కూతురు. ఐశ్వర్య కూడా డైరెక్టర్ విద్యనభ్యసించింది. అంటే బ్రహ్మానందం డైరెక్టర్ ను తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాడనిమాట! ఎంగేజ్మెంట్ సమయంలో హాస్య బ్రహ్మ కోసం కోడలికి బంగారు నక్లీస్ ఇచ్చాడట. ఇది కొన్ని లక్షల ఖరీదు చేస్తుందని టాక్.

బ్రహ్మానందం విషయానికి వస్తే ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద కుమారుడు గౌతం తండ్రి బాటలో నడుద్దామని ప్రయత్నించాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడప్పుడు బ్రహ్మానందం తన మనవళ్లతో ఆడుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. చిన్న కుమారుడు గౌతమ్ విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డాడు..