CINEMA

మెగా ఫ్యామిలీ నుంచి భారీ మల్టీ స్టారర్ మూవీ .. హింట్ ఇచ్చేసిన వరుణ్ తేజ్ ..!!

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వస్తున్నాయి. వీటిని చూసేందుకు కూడా జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.

స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఒక చిన్న హీరో సినిమాలో కూడా పెద్ద హీరోలు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది అంటూ హింట్ ఇచ్చేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన ‘ గాండీవదారి అర్జున ‘ సినిమా ఈనెల 25వ తారీఖున గ్రాండ్గా థియేటర్స్ లలో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి క్రమంలోనే హోస్ట్ మీ ఫ్యామిలీ నుండి మల్టీ స్టారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, ఆల్రెడీ సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించారు. అలాంటిదే మరొక సినిమా ఏదైనా రాబోతుందా అని అడిగారు. దానికి బదులుగా వరుణ్ మాట్లాడుతూ కచ్చితంగా మల్టీస్టారర్ సినిమా చేస్తాం. డైరెక్టర్స్, మేకర్స్ మంచి కథలను రాసుకొని వస్తే కచ్చితంగా కలిసి సినిమాలో నటించడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ఐదుగురం అయినా సరే కలిసి నటించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ క్రేజీ హింట్ ఇచ్చేశాడు.

దీంతో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్టీస్టారర్ లో నటించడానికి మెగా హీరోలు సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి కథను ఏ దర్శకుడు రెడీ చేస్తారో చూడాలి. మెగా ఫ్యామిలీ నుంచి భారీ మల్టీ స్టారర్ సినిమా అంటే అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇకపోతే వరుణ్ తేజ్ ప్రస్తుతం నటించిన గాండీవదారి అర్జున సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.