వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గజ్వేల్‌తోపాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతానని ప్రకటించారు.
ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖానాపూర్, బోథ్, స్టేషన్ ఘన్‌పూర్, భద్రాచలం, ఉప్పల్, వైరా, వేములవాడలో అభ్యర్థులను మార్చారు.
భయమా.. జాగ్రత్తా..?
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని ప్రతిపక్షాలు బలంగా చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 19 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి మూడోస్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒకరే బరిలో దిగనున్నారు. దీంతో ఆశించినంత మెజార్టీ రాదనే కారణంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ను హుజూరాబాద్‌లో ఓడించానని, వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లోనే ఓడిస్తానని సవాల్ చేశారు. దీంతో ఈటల సత్తా తెలిసిన కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.
బిడ్డ కోసం కావొచ్చు..
కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయడంపై మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. నిజాబాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత ఘోరంగా ఓడిపోయారు. 70 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అర్వింద్ గెలిచారు. దీంతో ఈసారి అలాంటి పరిస్థితి కూడా రావొద్దని, ఈసారి తన కూతురును ఓలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో కేసీఆర్ తన కూతురు సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా నుంచి బరిలో దిగాలని నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రచారంపై బీఆర్‌ఎస్ ఆశాభావం..
ఇదిలా ఉంటే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం వలన తమ పార్టీకి విస్తృత ప్రచారం లభిస్తుందని ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నేతలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెండు చోట్ల నుంచి పోటీ చేయడం కేసీఆర్‌కు కొత్తేం కదు. కేసీఆర్ గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా, సిద్ధిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ విజయం సాధించారు. .