CINEMA

Preity Zinta : ముంబైలో కాస్ట్లీ ఇల్లు కొన్న ప్రీతి జింటా..

హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు..

ఇక ఈ అమ్మడు క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది.. లగ్జరీ కార్లు కొనే అమ్మడు తాజాగా ఖరీదైన ఇల్లు ను కొన్నది.. ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం..

దేశ రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు పుంజుకుంటుంది..ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, అతని భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్, సమంత, రష్మిక మందన్న మొదలగు సెలెబ్రేటీలు లగ్జరీ ఇళ్లను కొన్నారు..