CINEMA

ఆస్పత్రిలో షాకింగ్‌గా సీరియల్ నటి..

మౌనీ రాయ్ (Mouni Roy) అంటే తెలియని తెలుగు ప్రేక్షకులకు నాగినిగా మాత్రం చాలా పాపులర్. బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రంలో లేడి విలన్ జునూన్ గా నటించి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డ్ అందుకుని సత్తా చాటింది.

ఇటీవల కెన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డ్ కూడా అందుకుని దుమ్ములేపింది. ఇలా అవార్డులు, సినిమాలతోనే కాకుండా అందాలను ఆరబోయడంలో కూడా అవార్డ్ పొందే మౌనీ రాయ్ తాజాగా హాస్పిటల్ లో ఊహించని కండిషన్ లో కనిపించింది. ఇంతకి ఆమెకు ఏమైందనే వివరాల్లోకి వెళితే..

 

అనేక భాషల్లో: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్​ ని హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని అనే సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఏకంగా మూడు సీజన్ల పాటు కొనసాగిన ఈ ధారవాహికకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా చాలా బాగా పాపులర్ అయిపోయింది.

 

ఐటమ్ సాంగ్స్: ‘క్యూకీ సాస్ బీ కబీ బహు తీ’ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది మౌనీ రాయ్. టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్ ‘కసో నా యార్ హై’, ‘కస్తూరి’, ‘దో సహేలియాన్’, ‘దేవాన్ కే దేవ్ మహాదేవ్’ వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది. ఇలా సీరియల్లు మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది.

 

సినిమాలు: మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ‘హీరో హిట్లర్ లవ్’ అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. దీని తర్వాత అక్షయ్ కుమార్ ‘గోల్డ్’లో నటించింది. ‘రోమియో అక్బర్ వాల్టర్’, ‘మేడ్ ఇన్ చైనా’ వంటి తదితర చిత్రాల్లోనూ తళుక్కుమంది.