CINEMA

పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15 వ మూవీ అది. అందుకే దానికి ఆర్సీ 15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ రాజమండ్రి, హైదరాబాద్ లో పూర్తి అయింది. తదుపరి షెడ్యూల్ న్యూజిలాండ్ లో ఉండబోతోంది.

దాని కోసం ఒక పాటను అక్కడ తెరకెక్కించబోతున్నారు. న్యూజిలాండ్ లో తెరకెక్కించబోయే పాటను ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. రామ్ చరణ్, కియారా అద్వానీ మీద ఓ సాంగ్ ను అక్కడ షూట్ చేయనున్నారట. అది రొమాంటిక్ సాంగ్ కావడంతో దానికి బెస్ట్ లొకేషన్ గా న్యూజిలాండ్ ను ఎంచుకున్నారట. కేవలం ఈ పాట కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదట మూవీ యూనిట్. కేవలం ఆ పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఒక పాట కోసం ఇంత ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు.

కానీ.. ఈ సినిమాలో మాత్రం ఆ పాట కోసం ఏకంగా అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. మరి.. అంత ఖర్చు పెట్టేంతగా ఆ పాటలో ఏముంటుందో తెలియాలంటే ఆ సినిమా విడుదలయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక పొలిటికల్ త్రిల్లర్ గా వస్తోంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతే కాదు.. రామ్ చరణ్ ఈ సినిమాల్లో డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఎన్నికల కమిషనర్ గా కనిపించబోతున్నాడు.