ఫిదా సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది నటి సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగులోఎన్నో సినిమాల్లో నటించింది. తన విలక్షణమైన నటన, అందంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. హీరోయిన్ క్యారెక్టర్‌కు యాక్టింగ్ ఉండే స్కోప్ సినిమాలనే తను ఒప్పకుంటుంది. గ్లామర్‌కు, ఎక్స్‌పోజింగ్ కాకుండా నటనకే ప్రాధాన్యమిచ్చే నటి సాయిపల్లవి. అందుకే చాలా తక్కువ సినిమాల్లో ఆమె నటిస్తుంటారు. అయితే, ఇప్పడు తాజాగా రామ్‌చరణ్‌తో సాయిపల్లవి జోడి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement
మహేష్‌బాబు సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి : గ్లామర్ హీరోయిన్ క్యారెక్టర్లు. అంతేకాకుండా, సాంగ్స్‌లలో రోమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి అస్సలు అంగీకరించదు సాయిపల్లవి. ఇలాంటి విషయాలలో పెద్దపెద్ద స్టార్స్‌ను సైతం పక్కన పడేస్తుంది. గతంలో మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరులో అవకాశం వచ్చింది. అయితే, ఈ సినిమా కథ విని వెంటనే రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. దాంతో సాయి పల్లవి ఎంతో స్పెషల్ అనే పేరును సంపాదించుకుంది. ఆమె దగ్గరకు కథలు చెప్పేందుకు వెళ్లిన దర్శకులు సైతం జాగ్రత్తగా ఉంటున్నారని సమాచారం. కేవలం మంచి కథలు హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలను మాత్రమే ఆమె ఎంచుకుంటారు. అయితే తాజాగా సాయి పల్లవి రామ్ చరణ్ తో జోడీ కట్టబోతుంది అనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రూరల్ నేపథ్యంలో సాగే సినిమా : ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్వకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమాలో రామ్‌చరణ్‌గా జోడిగా అనేక పేర్లు వినిపించాయి. అందులో ఎవరిని కన్‌ఫార్మ్ చేసినట్లు తెలియలేదు. ఈ పేర్లలో ముందుగా మృణాళ్ పేరు బయటపడింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు వీళ్లిద్దరిని పక్కనపెట్టి సాయిపల్లవి పేరు కొత్తగా వినిపిస్తుంది. ఈ సినిమా రూరల్ నేపథ్యంలో సాగుతుంది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి అయితేనే బాగుటుందని దర్శకుడు బుచ్చిబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి : ఈ సినిమాలో సాయిపల్లవి ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం వల్ల ఈ సినిమాకు సాయిపల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఉప్పెన సినిమాలో నటించిన విజయ్‌సేతుపతి ఈ సినిమాలో కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా గురించి టీమ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నటుడు రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.