CINEMA

సలార్ సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటో లీక్ చేసిన ప్రశాంత్ నీల్…షాక్ లో ప్రభాస్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో ప్రభాస్ ఒకరు. ఈయన తీసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.ఇక తన కెరియర్ మొదట్లో వర్షం, ఛత్రపతి, డార్లింగ్ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో పాటుగా ఈయన రాజమౌళితో చేసిన బాహుబలి సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచాడు. అలాగే ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా కూడా తన క్రేజ్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

 

More

From Tollywood

అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు అన్ని కూడా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కించిన మేకర్స్ ఈ సినిమా రెండు పార్ట్ లు గా వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే ప్రశాంత్ నీల్ తీసిన కే జి ఎఫ్ సీరీస్ రెండు పార్టులు గా వచ్చి అది సూపర్ డూపర్ హిట్టయింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా సలార్ సినిమా కూడా రెండు పార్టులు గా రాబోతుంది. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి స్పందిస్తూ ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది.

 

కానీ డిసెంబర్ 22వ తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెబుతూనే, డిసెంబర్ ఒకటోవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా డిసెంబర్ 1 వ తేదీన ప్రేక్షకులు వీక్షించనున్నారు అంటూ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. ఇక అలాగే ఈ సినిమా స్టోరీ గురించి కూడా మాట్లాడుతూ దానికి సంభందించిన చిన్న క్లూ ఇస్తూ ఇది ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉండి ఆ తర్వాత శత్రువులుగా మారిన ఇద్దరు వ్యక్తుల కథ అంటూ లీక్ చేశాడు.

 

ఇక ఇది విన్న జనం రొటీన్ కాన్సెప్ట్ మీద ఈ సినిమా తెరకెక్కిన కూడా ఈ సినిమాలో యాక్షన్ అంశాలు కానీ, ఎమోషన్ అంశాలు కానీ చాలా పీక్ లెవెల్ లో ఉంటాయి,అలాగే ప్రశాంత్ నీల్ తన మేకింగ్ తో ఈ సినిమాని వేరే రేంజ్ కి తీసుకెళ్లి ఉంటాడు అంటూ ప్రభాస్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు