TELANGANA

తెలంగాణలో ముగిసిన పోలింగ్..

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతంగా నమోదు అయింది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.