CINEMA

సలార్ నుండి మరో సర్ప్రైజ్…

ఈ మేరకు టాలీవుడ్ లో క్రేజీ గాసిప్ ఒకటి తెరపైకి వచ్చింది. సలార్ ట్రైలర్ ఓ వర్గానికి నచ్చలేదు. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన ఉంది. సినిమాపై హైప్ మరింతగా పెంచాలంటే మరో ట్రైలర్ విడుదల చేయడం మంచిదని భావిస్తున్నారట. కాబట్టి సలార్ ట్రైలర్ 2 కట్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు. విడుదలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండగా గ్రాండ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

సలార్ మూవీ కథపై ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. సలార్ ఇద్దరు మిత్రుల కథ. ప్రభాస్-పృథ్విరాజ్ ఫ్రెండ్స్ రోల్స్ చేస్తున్నారు. పృథ్విరాజ్ కి శత్రువుల నుండి ప్రమాదం రాగా కాపాడే సైన్యంగా ప్ర ప్రభాస్ వస్తాడు. ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రభాస్ లుక్ అదిరిపోయాయి. సోలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు. సలార్ వరల్డ్ వైడ్ డిసెంబర్ 22న విడుదల కానుంది.

 

సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహతో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడన్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ మేకర్స్ సలార్ తెరకెక్కిస్తున్నారు. సరైన విజయాలు లేక సతమతమవుతున్న ప్రభాస్ సలార్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి సలార్ తో ప్రభాస్ ఈ స్థాయి ప్రభావం చూపుతారో…