CINEMA

అంచనాలకు మించి ఉండబోతున్న సలార్ 2..

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సలార్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ ఎంత డైనమిక్ గా చూడాలి అని అనుకున్నారు ప్రశాంత్ నీల్ అంతకంటే డైనమిక్ గా చూపించేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి తగిన ఇమేజ్ ఉండే పాత్ర చేశాడు అని అందరూ అంటున్నారు. ఎంతో గ్రిప్పింగా సాగే కథ ,అంతకంటే అద్భుతంగా ఉన్న ఫైటింగ్స్ సన్నివేశాలతో సలార్ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

 

ఈ మూవీని అందరూ ప్రశంసిస్తున్న మాట నిజమే కానీ అక్కడక్కడ చిత్రంపై కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగా చూపించలేదని.. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం వైరంగా ఎలా మారింది అన్న విషయాన్ని మూవీలో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని కొందరు భావిస్తున్నారు. అలాగే స్టొరీ ని కూడా కాస్త గందరగోళంగా నడిపించారు అన్న వాదన వినిపిస్తోంది. చాలా విషయాలు కన్ఫ్యూజింగ్ గా ఉండడమే కాకుండా అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావడం లేదు.. ఇలా మూవీపై ఎన్నో కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.

 

అయితే కంగారు పడాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఈ కన్ఫ్యూషన్ అంతా రాబోయే ఎక్సైట్మెంట్ కి ముందు ట్రీట్ లాగా అంటున్నారు సినీ విశ్లేషకులు. సలార్ పార్ట్ 1 లో హీరో పాత్ర యొక్క అన్ని కోణాలను పూర్తిస్థాయిలో చూపించలేదు.. ఎందుకంటే అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2 లోనే అట. మొదటి భాగంలో పృధ్విరాజ్ తో ప్రభాస్ వైరం గురించి పైపైన అలా మాటలు రూపంలో చెప్పారే తప్ప తెరపై పెద్దగా చూపించలేదు. ఇలా చేయడం వల్ల ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అన్న ఆసక్తి ఆడియన్స్ లో అలాగే మెయింటైన్ అవుతుంది.

 

వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈ క్వశ్చన్ కొన్ని సంవత్సరాలు మనల్ని వెంటాడింది గుర్తుందా.. దాని ఫలితం బాహుబలి 2 కి విపరీతమైన హైప్ రావడం. ప్రశాంత్ నీల్ సేమ్ స్ట్రాటజీని సలార్ విషయంలో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి భాగంలో పైపైన కనిపించిన జగపతిబాబు పాత్ర రెండవ భాగంలో చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉందట. నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ పాత్రకు సంబంధించి సరికొత్త కోణాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. కథ మొత్తం అతని చుట్టే తిరగడంతో పాటు ఇంతకు మించి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్.