ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరో అయిన రన్బీర్ కపూర్ తో ఇంత పెద్ద భారీ సినిమాని తీసి 1000 కోట్ల కలక్షన్స్ కి చేరువలోకి తీసుకొచ్చాడు అంటే ఈ ఘనత అంతా సందీప్ రెడ్డి వంగ దే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మైండ్ లో పుట్టిన ఒక ఆలోచనని తెర పైకి అలా ఎక్కించి ప్రతి ప్రేక్షకులకు నచ్చే విధంగా దాన్ని స్క్రీన్ పైన చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ విషయంలో సందీప్ వంగ తనదైన రీతిలో ఈ సినిమాతో సక్సెస్ సాధించి చూపించాడు.
అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కోసం రెడీ అవుతుంది. అయితే మూడు గంటల 23 నిమిషాల 21 సెకండ్ల రన్ టైం తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా కట్ చేసిన ఎనిమిది నిమిషాలు కలుపుకొని ప్రస్తుతం ఓటిటిలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓటిటీ కోసం ప్రత్యేకంగా సందీప్ రెడ్డి వంగ మరొకసారి సినిమా ఎడిటింగ్ రుం లో కూర్చున్నట్టు గా తెలుస్తుంది. ఇక కట్ చేసిన పార్ట్ ని మళ్ళీ యాడ్ చేస్తూ ఈ సినిమాలో ఎనిమిది నిమిషాల ఫుటేజ్ ను కూడా ఆడ్ చేస్తూ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే అధికారికంగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటిటి లోకి రావాలి అనేది మాత్రం ప్రొడ్యూసర్లు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా అయిన లేదా గణతంత్ర దినోత్సవ వేడుకని పురస్కరించుకొని అయిన ఓటిటి ప్లాట్ ఫామ్ మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యం తో అనిమల్ సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది…