CINEMA

రామ్ చరణ్ మూవీలో ప్రగ్యా జైస్వాల్..?

RC 16.. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) అనగానే అందరికీ బాలయ్య(Balakrishna ) హీరోయిన్ అనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్యకు జోడీ గా అఖండ(Akhanda ), డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. అఖండ 2 లో అవకాశం దక్కించుకుంది. బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha menon) నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రగ్యా జైస్వాల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. మరికొందరేమో బాలయ్య సినిమాలో పక్కాగా ప్రగ్యాకు అవకాశం ఉంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

 

ఆర్ సి 16 లో ఛాన్స్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ..

 

అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరో జాక్ పాట్ కొట్టింది అని చెప్పాలి. సాయి శ్రీనివాస్ బెల్లంకొండ (Sai Srinivas Bellamkonda) )నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా RC 16 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే సినిమాలో ప్రగ్య జైస్వాల్ కి ఒక కీలక పాత్ర కేటాయించినట్లు సమాచారం. ఇందులో ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రగ్య పాత్ర ఈ సినిమాలో మాసివ్ గా కనిపించబోతోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

అనసూయ స్థానంలో ప్రగ్యా..

 

వాస్తవానికి సుకుమార్(Sukumar ) శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ ఆర్ సి 16 సినిమాల్లో మొదట అనసూయ(Anasuya) ను ఈ పాత్ర కోసం తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె అప్పటికే ‘రంగస్థలం’లో మాస్ రోల్ చేసింది. పైగా ఆ పాత్రతో రంగమ్మత్త గా చెరగని ముద్ర వేసుకుంది అనసూయ. ఇక అందుకే మళ్ళీ ఆమెకు అలాంటి పాత్ర ఇవ్వకుండా ఒక కొత్త ప్రెష్ నెస్ తీసుకురావడానికి బుచ్చిబాబు ఫామ్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం . ఇక ఆమెను అప్రోచ్ అవ్వగా ప్రగ్యా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇక త్వరలోనే దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

 

సక్సెస్ కోసం ఆరాటపడుతున్న రామ్ చరణ్..

 

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత తన తండ్రి చిరంజీవి(Chiranjeevi) తో కలిసి చేసిన సినిమా ‘ఆచార్య’ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్ ‘సినిమా చేసినా.. ఇది కూడా బోల్తా పడింది. ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని లేకపోతే హ్యాట్రిక్ ఫ్లాప్ గా మిగిలిపోతారని ఆందోళనలో అభిమానులు ఉన్నారు. అటు రామ్ చరణ్ కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బుచ్చి బాబు కూడా ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తన రెండవ సినిమాతోనే ఏకంగా గ్లోబల్ స్టార్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. అటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తన అందచందాలతో మెస్మరైస్ చేయడానికి సిద్ధమైంది. మరి వీరి ముగ్గురి కలయికలో రాబోతున్న ఆర్సి 16 అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.