CINEMA

‘సలార్’ రన్ టైమ్ ఎంతంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఈ మూవీకి రన్ టైమ్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. సలార్ పార్ట్-1ను 2.55 గంటల నిడివి ఉండేలా మేకర్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే అత్యధిక రన్ టైంగా చెబుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.