CINEMA

నాగ అశ్విన్ -ప్రభాస్ మూవీపై భారీ అంచనాలు

ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత చిత్రాన్ని అందించిన నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ కె పేరుతో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్‌ సినిమా పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ప్రాజెక్ట్‌ కే అనేది వర్కింగ్ టైటిల్‌ మాత్రమేనని అసలు టైటిల్‌ ఏంటన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా దీపికా నటిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఓ విజువల్‌ వండర్‌లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్తతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌ పూర్తి చేసి 2024 ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. ఈ 2023 చివరి కల్లా సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్‌లో చాలా భాగం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే కేటాయిస్తోంది చిత్ర యూనిట్.