CINEMA

అఫిషీయల్ గా ప్రకటించిన నిఖిల్..టాలీవుడ్ యంగ్ హీరో విడాకులు….?

ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో నిఖిల్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు జూనియర్ మాస్ మహారాజా రవితేజ గా పేరు సంపాదించుకున్న నిఖిల్ కెరియర్లో కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించాడు . అంతేకాదు రీసెంట్ గా కార్తికేయ 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ .

కాగా సినీ కెరియర్ కి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నా ..గత కొన్ని నెలలుగా వ్యక్తిగతంగా ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో వేగలేక విడాకులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నిఖిల్.. పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పల్లవి ఎవరో కాదు తన ఫ్రెండ్. ఈ క్రమంలోని పల్లవికి సంబంధించిన వార్తలు రకరకాలుగా వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్లిద్దరికి అస్సలు సఖ్యతలేదని.. అందుకే వీళ్ళు ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పలేదని.. త్వరలోనే జంట విడాకులు తీసుకోబోతుందని యూట్యూబ్లో కూడా కొన్ని వార్తలు దర్శనం ఇచ్చాయి.

కాగా ఇలాంటి క్రమంలో అలాంటి వార్తలకు చెప్పి పెడుతూ నిఖిల్ అఫీషియల్ గా తాము విడాకులు తీసుకోవట్లేదని చెప్పకనే చెప్పేసాడు . నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ..”నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి నాకు ఏదో తెలియని కొత్త ఫీలింగ్ ..అద్భుతంగా ఉంటుంది “అంటూ భార్య పేరును ట్యాగ్ చేశారు. దీంతో వీళ్ళిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న న్యూస్ ఫేక్ అంటూ కొట్టి పడేసాడు నిఖిల్. కాగా వీరిద్దరి కొత్త ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు నిఖిల్ త్వరలోనే 18 పేజీస్ అనే సినిమాతో జనాలను అలరించబోతున్నాడు .చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతున్నాడి ఈ యంగ్ హీరో..!!