NationalTRENDING

వెలుగులోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది.

సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం జైలులో 1704 మంది ఖైదీలు ఉన్నారని ఇప్పటివరకు 140మంది ఖైదీలకు పాజిటివ్ గా గుర్తించామని తెలిపారు. వీరందరికీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఖైదీలందరికీ ఓపిడీ కార్డును తయారు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.

అయితే ఇది ఆశ్చర్యం కలిగించే అంశమని అన్నారు. ఎందుకంటే జైలుకు వచ్చే ముందు ఖైదీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఆ సమయంలో ఎందుకు బయటపడలేదనే అనుమానం వ్యక్తం చేశారు. వీరిలో చాలామంది ఖైదులు డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారే ఉన్నారని తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల మేరకే హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.