హీరోయిన్ హన్సిక మొదటిగా బాలీవుడ్ లో చిల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందండి. పేరుకే నార్త్ ఇండియా అమ్మాయి అయినా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించగా, హన్సిక హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ పాస్టర్ హిట్టు అందుకోవడంతో హన్సిక కు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మస్కా , బిల్లా వంటి పెద్ద పెద్ద సినిమాలలో నటించింది ఈ వైట్ బ్యూటీ. ఆ తర్వాత 2011లో మాప్పిళ్లే అనే సినిమాతో సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అక్కడ కూడా తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టేసింది. ఇక ఈ వైట్ బ్యూటీ లవ్ ఎఫైర్ ల గురించి మనందరికీ తెలిసినదే. కొన్నాళ్లు తెలుగు హీరో సిద్ధార్థతో లవ్ ట్రాక్ నడిపించింది. అలాగే శింబుతో కూడా కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది.
ఇక ఆ తర్వాత వీరికి బ్రేకప్ చెప్పేసి సైలెంట్ గా ఉండిపోయింది. అయితే ఈ వైట్ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది అన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తన చిన్ననాటి మిత్రుడైన ఇంకా అలాగే బిజినెస్ పార్టనైన సోహెల్ అనే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. అయితే అతనికి ఇదివరకే పెళ్లయిందట ఇక కొన్ని అనివార్య కారణాల వలన మొదటి భార్యతో విడాకులుు తీసుకున్నాడు. అతని మొదటి భార్య మరెవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ అట. ఆమె వలన వీరిద్దరికీ పరిచయం జరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికిి దారి తీసింది. ఇక హన్సిక సోహెల్ ల పెళ్లి డిసెంబర్ 4న రాజస్థాన్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం. ఇక వీరి పెళ్లి పనులు ఆల్రెడీ మొదలైపోయాయి కూడా.. మంగళవారం ముంబైలోని హన్సిక నివాసంలో మాతాకీ చౌకీ అనే పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారట. ఇక ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు ఇద్దరు సాంప్రదాయం ప్రకారం రెడీ అయి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వీరు రెడ్ డ్రస్సు లో కనిపించి సోషల్ మీడియాలో హైలెట్ న్యూస్ గా నిలిచారు.