CINEMA

ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది హన్సిక. అలాగే టాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించిన మెప్పించింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భర్త పేరు తెలిపుతూ అతన్ని పరిచయం చేసింది హన్సిక. అతని పేరు సోహెల్ ఖత్తూరియా అని ఆమె వెల్లడించింది. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని హన్సిక షేర్ చేసింది. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి..

హన్సిక, సోహైల్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహందీ వేడుకలో హన్సిక తనకు కాబోయే భర్త సోహైల్ తో కలసి అప్పుడే రొమాన్స్ మొదలు పెట్టేసింది. కాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫొటోలలో ఇద్దరూ చాలా సంతోషంగా, కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన హన్సిక అభిమానులు ఫోటోలపై కామెంట్ల విషయం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్స్ బ్యూటిఫుల్ కపుల్ అనే కామెంట్ చేయగా ఇంకొందరు, కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు. ఆ ఫోటోలలో హన్సిక రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని మెహేంది పెట్టించుకుంటుండగా పక్కనే ఆమె భర్త కూర్చుని ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ అతని కూడా మెహేంది పెట్టించుకున్నాడు.