CINEMA

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తెరికెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కు మొదట విరూపాక్ష టైటిల్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తేజ్‌ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా యొక్క టైటిల్ మరియు గ్లింమ్స్ ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా యొక్క గ్లింమ్స్ విడుదల కాబోతున్నట్లుగా సాయి ధరమ్ తేజ్ ప్రకటించాడు. ఈ సినిమా కు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ టైటిల్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రిజిస్టర్ చేయించారు అనే వార్తలు వచ్చాయి.

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం తెరికెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కు మొదట విరూపాక్ష టైటిల్ ని అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విరూపాక్ష కాకుండా హరిహర వీరమల్లు టైటిల్ కన్ఫమ్ చేశారు. హీరో పేరు విరూపాక్ష అయితే బాగుంటుందని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత వీరమల్లు అయితే ఇంకాస్త బెటర్ గా ఉంటుందని అభిప్రాయంతో దర్శకుడు క్రిష్ విరూపాక్ష టైటిల్ ని పక్కకు పెట్టి హరిహర వీరమల్లుని కన్ఫామ్ చేశాడు. ఇప్పుడు విరూపాక్ష టైటిల్ని సాయి ధరమ్ తేజ్ తన 15వ సినిమాకు వినియోగించబోతున్నాడట. రేపు విరుపాక్ష టైటిల్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.