CINEMA

ప్రముఖ కామెడియన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటీనటుల ప్రవర్తన కొంచెం వ్యతిరేకంగా ఉంటే వెంటనే దర్శక నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు (Yogibabu) పై నిర్మాత గిన్నిస్ కుమార్ చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. అసలు విషయంలోకెళితే రెమ్యునరేషన్ తీసుకొని ఇప్పుడు సినిమాలో నటించడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదంటూ నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవాళ యోగి బాబు, నితిన్ , సత్య కలిసి నటించిన చిత్రం దాదా. ఇందులో గాయత్రి హీరోయిన్ గా నటించింది. నాజర్ , మనోబాల, సింగముత్తు, భువనేశ్వరి తదితరులు కీలకపాత్రలను పోషించారు. కథ, స్క్రీన్ ప్లే , మాటలు సమకూర్చిన గిన్నిస్ కిషోర్ సొంతంగా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ కి యోగి బాబు హాజరు కాలేదు.

ఇందులో భాగంగా నిర్మాత మాట్లాడుతూ యోగి బాబుకు ఎంతో మేలు చేశాను. ఆ విశ్వాసం కూడా ఆయనలో లేదు. పైగా దాదా చిత్రం పంపిణీ హక్కులను చాలామందికి ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. నా బ్యానర్ లోనే మరో చిత్రంలో నటిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు నటించడానికి ముందుకు రాలేదు అని తెలిపారు. తనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు యోగి బాబు (Yogi Babu) మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని నిర్మాత గిన్నిస్ కుమార్ నిర్మాత మండలి పేర్కొన్నారు. మరి యోగి బాబు తన పై వస్తున్న వాదనలకు క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ఇలాంటి సంఘటనలు కేవలం తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు ఇతర భాష ఇండస్ట్రీలలో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అందుకే కొంతమంది నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తూ ఉంటారు . అయితే కొంతమంది అయినా కూడా వినకుండా విరుద్ధంగా ప్రవర్తించి కెరియర్ పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కనీసం ఇలాంటి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని యోగిబాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి.