తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి డిస్ట్రిబ్యూటర్ గా అడుగుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు దిల్ రాజు. ఈయన మొదట కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దిల్ సినిమా హిట్ కావడంతో అప్పటినుండి ఈయన ను దిల్ రాజు అని ఇండస్ట్రీ జనాలు పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజు ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో మంచి మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజును చాలామంది నిర్మాతలు టార్గెట్ చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అని దిల్ రాజు (Dil Raju) ను అడిగితే మీరు అనుకునే విషయాలు మొత్తం నిజమే అంటూ దిల్ రాజు అంటున్నారట.ఎందుకంటే చాలా రోజులుగా సంక్రాంతి పండుగ బరిలో చాలా సినిమాలు వస్తాయి అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు సంక్రాంతి కానుక గా చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య, ఇటు బాలకృష్ణ వీర సింహారెడ్డి (Veera simhareddy)సినిమాలు వస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి.
అలాగే సంక్రాంతికి కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు సినిమా కూడా వస్తుంది అని దిల్ రాజు ప్రకటించారు. కానీ సంక్రాంతికి కేవలం తెలుగు భాష సినిమాలు మాత్రమే విడుదల చేయాలి ఇతర భాషల సినిమాలు వద్దు అంటూ నిర్మాతల కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. కానీ దిల్ రాదు ఈ విషయంలో పట్టిన పట్టు వీడకుండా కచ్చితంగా వారసుడు (Varasudu) సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాని కేవలం ప్రేక్షకులకు వినోదం అందించడం కోసమే కానీ డబ్బులు సంపాదించడానికి కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ.. ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలామంది దర్శక నిర్మాతలు మా సినిమా ఉండాలి అంటే మా సినిమా ఉండాలి అంటూ గొడవలు పెట్టుకునే వరకు వెళ్లారు.
అయితే ఇలాంటి సందర్భంలో అందరు నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుంటే ఈ గొడవ సర్దుమణుగుతుంది.కానీ ఈ విషయం లో నాతో మాట్లాడడానికి ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. చాలామంది నిర్మాతలు నాతో క్లోజ్ గా ఉన్నప్పటికీ నాతో మాట్లాడడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఇందుకు ప్రధాన కారణం చాలామంది నన్ను ఇండస్ట్రీలో తొక్కేయడానికి చూస్తున్నారు. నా ఎదుగుదలను ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే కనీసం నాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇక ఈ విషయంలో మా నిర్మాతల కౌన్సిలే ముందుగా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. నాకు ఇప్పటికే థియేటర్లు చాలా ఉన్నాయి. అంతేకాదు నేను నిర్మాతగా స్టార్ పొజిషన్లో ఉన్నాను.అందుకే ఇవన్నీ ఓర్వలేని చాలామంది నా చుట్టూ ఎన్నో వివాదాలు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అసలు ఈ విషయం నా దృష్టిలో పెద్ద ప్రాబ్లమే కాదు నేను ఎవరికి భయపడను అంటూ దిల్ రాజు (Dil Raju) చెప్పుకొచ్చారు.ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.