CINEMA

షారూఖ్ ఖాన్ పై కేసు పెట్టాలని బిహార్ లోని ఒక కోర్టులో పిటిషన్

పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక పదుకోన్ ధరించిన బికినీ పై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని వీహెచ్ పీ సహా పలు హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ధైర్యముంటే షారూఖ్ ఖాన్ ఇస్లాం పైన, మొహమ్మద్ ప్రవక్త పైనా సినిమా తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాషాయ రంగు బికినీ ధరించడం హిందువులను అవమానించడమేనని వారు మండి పడ్తున్నారు. హిందూ సెంటిమెంట్లను అవమానించిన కారణంగా షారూఖ్ ఖాన్ పై కేసు పెట్టాలని బిహార్ లోని ఒక కోర్టులో పిటిషన్దాఖలైంది. misogyny: మహిళా ద్వేషం.. ఈ వివాదంపై నటి, కాంగ్రెస్ నేత రమ్య స్పందించారు. మహిళలపై ద్వేషాన్ని, విషాన్ని కక్కే ఏ అవకాశాన్ని వారు వదులుకోవడం లేదని ఆమె విమర్శించారు

. మహిళలపై ద్వేషాన్ని వెల్లగక్కడానికి సంబంధించి ఇది మరో ఉదాహరణ అన్నారు. మహిళల స్వేచ్ఛ ను జీర్ణించుకోలేని శక్తులు సమాజంలో చాలా ఉన్నాయన్నారు. ‘From Samantha to Deepika’: సాయి పల్లవి, సమంత కూడా బాధితులే.. ఈ స్త్రీ ద్వేషానికి సినీ తారలు సమంత, సాయి పల్లవి, రష్మిక మందాన కూడా బాధితులేనని రమ్య వ్యాఖ్యానించారు. అక్కినేని చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత సమంత, కశ్మీరీ పండిట్లపై ధైర్యంగా చేసిన వ్యాఖ్యలకు సాయి పల్లవి, రక్షిత్ షెట్టితో బ్రేకప్ పై రశ్మిక మందన.. ఈ స్త్రీ ద్వేషుల ట్రోల్స్ కు బలైన వారేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి దీపిక చేరిందన్నారు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా మసలే ఆడవాళ్లను స్వాగతించే స్థాయిలో వారు లేరని రమ్య మండిపడ్డారు. స్త్రీ ద్వేషాన్ని వ్యతిరేకించడానికి మహిళలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని రమ్య ట్వీట్ చేశారు.