పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాత. చాలాకాలం క్రితమే సినిమా ప్రారంభమయ్యింది. కోవిడ్ సహా అనేక కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ హరిహర వీరమల్లు ‘, ఈసారి వేసవి సీజన్‌లో విడుదలయ్యేందుకు ఆస్కారముంది. యాక్షన్ బ్లాక్ పూర్తయ్యిందట.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్ పూర్తయినట్లు తెలుస్తోంది.
మేజర్ యాక్షన్ బ్లాక్ ఇది. దీనికోసమే ముందస్తుగా వర్క్ షాప్ కూడా నిర్వహించారు నటీనటులతో, సాంకేతిక నిపుణులతో. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించి ఇదే అత్యంత కీలకమైన పార్ట్ అట. ఇది పూర్తవడంతో, పవన్ కళ్యాణ్ దాదాపు ఫ్రీ అయిపోయినట్లేనని అంటున్నారు. మిగతా షూటింగ్ పార్ట్ శరవేగంగా పూర్తి కాబోతోందట. పూర్తయిన యాక్షన్ బ్లాక్‌కి విజయ్ స్టంట్ కొరియోగ్రఫీ అందించారు. ఇంతకీ, ‘హరిహర వీరమల్లు’ సినిమా ఓ కొలిక్కి వచ్చినట్లే భావించాలా.? రీషూట్ అనుమానాల సంగతేంటి.?