CINEMA

చిరంజీవి తన ఆస్తినంతటినీ తన తన వారసత్వానికి.. అంటే చరణ్‌కి పుట్టబోయే కొడుకు లేదా కూతురికి చెందేలా వీలూనామా

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆస్తి గొడవలంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్ల ప్రకారం చూస్తే, చిరంజీవి తన ఆస్తినంతటినీ తన తన వారసత్వానికి.. అంటే చరణ్‌కి పుట్టబోయే కొడుకు లేదా కూతురికి చెందేలా వీలూనామా రాసేశారట.

గుర్రుగా వున్న కుమార్తెలట.. దాంతో, చిరంజీవి కుమార్తెలైన సుస్మిత, శ్రీజ.. గుర్రుగా వున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏ కుటుంబంలో అయినా అసలు ఇలాంటి గొడవకు ఆస్కారం వుంటుందా.? చిరంజీవి తన కుమార్తెలకు.. కుమారుడితో సమానంగా ఎప్పుడో ఆస్తి పంపకాలు చేసేశారన్నది గతంలోనే వచ్చిన వార్త. సో, ఇప్పుడు కొత్తగా చిరంజీవి ఇంట్లో ఆస్తి గొడవలు ఎందుకొస్తాయ్.? పైగా, కుమార్తెల పట్ల చిరంజీవికి అమితమైన ప్రేమ.. అదే సమయంలో కుమార్తలెకీ తండ్రి పట్ల అపారమైన గౌరవం. అయినాగానీ.. డబ్బెవరికి చేదు.?