CINEMA

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే విడాకులు

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్(prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్నాడు. కానీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇప్పటికే ప్రభాస్ వయసు 43కు చేరువైంది. ఈయన ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని గత పదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా విడుదల తర్వాతే ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(anushka shetty)తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. ఆమెను పెళ్లి చేసుకోవడం ఖాయం అని గతంలో గట్టిగా ప్రచారం జరిగింది. అభిమానులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ముచ్చటపడ్డారు. అయితే ఈ ప్రచారాన్ని ఇటు ప్రభాస్, అటు అనుష్క ఇద్దరూ కొట్టిపారేశారు. తాము కేవలం ఫ్రెండ్స్ అని కుండబద్దలు కొట్టారు.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే విడాకులు మొన్నటికి మొన్న బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు పుట్టుకొచ్చాయి. చివరకు ఇవి కూడా గాలి వార్తలే అని తేలిపోయాయి. ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ ను `పెళ్లి ఎప్పుడు..?` అన్న ప్రశ్న వెంటాడుతూనే ఉంది. కానీ, ఆయన మాత్రం ప్రతిసారి మాట దాటేస్తూనే వచ్చాడు. అయితే రీసెంట్ గా ఓ జ్యోతిష్యుడు ప్రభాస్ పెళ్లి పై షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(astrologer venu swamy) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం తర్వాత ఆయన పేరు మార్మొగిపోయింది. ఆ తర్వాత నుంచి ఆయన పలువురు సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్తూ వీడియోలు పోస్ట్‌ చేయడం.. అవి వైరల్ అవ్వడం కామన్‌గా మారింది. ఈ క్రమంలో వేణు స్వామి ప్రభాస్‌ పెళ్లి(prabhas marriage)పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదని.. కాదని చేసుకుంటే విడాకులు పక్కా అని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. అంతేకాదు, పెళ్లి జరిగితే హీరో ఉదయ్‌ కిరణ్‌ జీవితం ఎలా అయ్యిందో.. ప్రభాస్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఇదెక్కడి జ్యోతిష్యం రా బాబు అంటూ ప్రభాస్ అభిమానుల తలలు పట్టుకుంటున్నారు.