Health

రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయ…….?

మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని తక్కువ దరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కొందరూ గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొందరేమో గుడ్డును తినాలా వద్దా తింటే లాభమా, తినకపోతే లాభమా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తినడంపై చాలా మంది అనేక అపోహలను కలిగి ఉంటారు. గుడ్డును తింటే శరీరంలో కొవ్వు చేరుతుందని చాలా అపోహపడుతుంటారు. కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుందనే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డును రోజూ వారి ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ సమకూరుతాయని అంటున్నారు.

రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయని అనడంలో అర్థం లేదని అంటున్నారు. కండరాల నిర్మాణానానికి అవసరమైన కొత్త కణాలను ఉత్పత్తి చేయడంలో కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తగిన మొత్తంలో ప్రోటీన్లు అందాలి. గుడ్డు ప్రోటీన్ లకు ప్రాథమిక వనరు అని అందరూ తెలుసుకోవాలి. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే ఆమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇతర ఆహార పదార్థాల ద్వారా ప్రోటీన్లు లభించినప్పటికి గుడ్డు ద్వారా లభించే ప్రోటీన్లు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. Egg అయితే గుడ్డును వండే విధానం, వాటిని నిల్వ చేసే విధానంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అల్పాహారాల్లో ఇతర ఆహార పదార్థాల కంటే గుడ్డుతో తయారు చేసిన టోస్ట్ ను తీసుకుంటే 50 శాతం ఎక్కువ సంతృప్తి సూచి ఉంటుంది. సాధారణ తృణ ధాన్యాలను అల్పాహారంగా తీసుకునే వారి కంటే గుడ్డును తీసుకునే వారు 29 శాతం మధ్యాహ్న భోజనాన్ని తక్కువగా తీసుకున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే గుడ్డును తీసుకోవడం వల్ల హెచ్ డి ఎల్ ( మంచి కొవ్వు) పది శాతం పెరిగినట్టు రుజువైంది. రోజూ ఒక గుడ్డు తింటే రోజూ వారి సిఫారసు చేసే విటమిన్ ఎ 6 శాతం, విటమిన్ బి 5 శాతం, ఫోలైట్ 5 శాతంతో పాటు ఫాస్పరస్, ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. గుడ్డును తినడం వల్ల కళ్లల్లో పొరలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డును తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. కనుక ఎటువంటి అపోహలు లేకుండా గుడ్డును ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.