National

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్​గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి. రాజస్థాన్​లో హోరాహోరీ.. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్​లో కూడా వచ్చే ఏడాదే ఎన్నికలు జరగొచ్చు. ఇవన్నీ చూస్తుంటే.. 2024 సార్వత్రిక ఎన్నికలకు.. 2023 ఎన్నికలు సెమీఫైనల్​గా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023 Rajasthan elections : ఈ 9 రాష్ట్రాల్లో.. రాజస్థాన్​, ఛత్తీస్​గఢలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంది. ఇటీవలే ముగిసిన హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల విజయంతో.. ఈ రెండు రాష్ట్రాలోని కాంగ్రెస్​ శ్రేణులు నూతన ఉత్సాహంతో బరిలో దిగుతారనడంలో సందేహం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటే.. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాల్ని ఇస్తున్నట్టు పరిగణించవచ్చు! 2018 రాజస్థాన్​ ఎన్నికల్లో బీజేపీని ఓడించి.. అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్​. 200 సీట్ల అసెంబ్లీలో 100 స్థానాలను దక్కించుకుంది. 2013లో 163 సీట్లతో ఘన విజయం సాధించిన కమలదళం.. 2018కి వచ్చేసరికి 73సీట్లకే పరితమైంది.

2023లో రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు తథ్యం! 1990 నుంచి ఇక్కడ.. అధికారం ఈ రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ వస్తోంది. Rajasthan Assembly elections 2023 : వాస్తవానికి.. కాంగ్రెస్​కు బీజేపీతో వచ్చే ఇబ్బందులు కన్నా సొంత పార్టీలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి! ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ మధ్య వివాదం, మాటల యుద్ధం నిత్యం వార్తల్లో నిలుస్తూ.. హైకమాండ్​కు తలనొప్పి తెప్పిస్తుంటాయి. ఇక 90 అసెంబ్లీ సీట్లున్న ఛత్తీస్​గఢ్​కు 2018లో ఎన్నికలు జరగ్గా.. 68 స్థానాల్లో గెలిచి విజయఢంకా మోగించింది కాంగ్రెస్​. ఫలితంగా.. 15ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 15 సీట్లే దక్కడం గమనార్హం. ఇటీవలే జరిగిన భానుప్రతాపూర్​ ఉప ఎన్నికలోనూ విజయం.. కాంగ్రెస్​నే వరించింది.