National

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం. బడ్జెట్ కు ముందే ఆయన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Modi cabinet expansion!: భారీగానే మార్పులు.. బీజేపీలోని, కేంద్రంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) పై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 2023 బడ్జెట్ సమర్పణకు ముందే మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) ఉండవచ్చు. జనవరి 15 తరువాత ఈ ప్రక్రియ ఉండవచ్చు. ఈ సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులే ఉండవచ్చు. పనితీరు సరిగ్గాలేని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశముంది. అలాగే, రాజస్తాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ ల నుంచి కొందరికి మంత్రులుగా అవకాశం ఇవ్వవచ్చు. Modi cabinet expansion!: బీజేపీలో సంస్థాగత మార్పులు బీజేపీలోనూ కీలకమైన సంస్థాగత మార్పులు జరిగే అవకాశముంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం జనవరి 20తో ముగుస్తుంది. జనవరి నెలలోనే పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు, అంతకుముందు, ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా పార్టీలో సంస్థాగత మార్పులు జరగనున్నాయి. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత, తొలిసారి మంత్రివర్గ విస్తరణ(cabinet expansion)ను 2021, జులై 7న ప్రధాని మోదీ చేపట్టారు.

ఆ సమయంలో, సీనియర్లు సహా 12 మంత్రులను పదవి నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. Modi cabinet expansion!: 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2023 లో తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు బీజేపీ కి చాలా కీలకం. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా వాటిని భావించవచ్చు. తెలంగాణ, కర్నాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్తాన్ ల్లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, చత్తీస్ గఢ్ ల్లో విజయం సాధించడం లేదా, మెరుగైన ఫలితాలను సాధించడం బీజేపీకి చాలా అవసరం. అందువల్ల ఈ అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ విస్తరణ(cabinet expansion)ను, బీజేపీ సంస్థాగత మార్పులను చేపట్టనున్నారు.