ఉత్తరాఖండ్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటి జోషి మఠ్ (Joshimath). ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రయాణాలకు తొలి మెట్టు జోషిమఠ్ (Joshimath). హిమాలయాలపై ట్రెక్కింగ్, లేదా బద్రీనాథ్ తీర్థ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. Why Joshimath is sinking?: నెమ్మది నెమ్మదిగా కుంగిపోతోంది.. జోషి మఠ్ (Joshimath) పట్టణం కుంగిపోతున్న విషయాన్ని గుర్తించి చాన్నాళ్లే అయింది. కానీ, ఆ ప్రక్రియ తీవ్రమవడం ఇటీవలనే ప్రారంభమైంది. ఇళ్ల గోడలపై, రోడ్ల పై పగుళ్లు కనిపించడం ప్రారంభమైంది. నేల కొద్దికొద్దిగా కుంగడం కనిపించసాగింది. శుక్రవారం ఒక ఆలయం కూడా కూలిపోయింది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. దాంతో, రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించింది. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
man made disaster: భౌగోళిక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు జోషి మఠ్ (Joshimath) హిమాలయ పర్వత పాదంలో నెలకొని ఉంది. గర్వాల్ హిమాలయాల్లో 1890 మీటర్ల ఎత్తున ఈ జోషి మఠ్ (Joshimath) ఉంది. ఈ పట్టణానికి నాలుగు వైపులా నదులు ప్రవహిస్తున్నాయి. తూర్పున ధాక్నల, పశ్చిమాన కర్మనస, దక్షిణాన ధౌలిగంగ, ఉత్తరాన అలకనంద నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జోషి మఠ్ (Joshimath) కు కొండచరియలు విరిగిపడే ముప్పు కూడా ఉంది. ఈ పట్టణ జనాభా 20 వేలు. భౌగోళిక పరమైన సమస్యలతో పాటు, ఎలాంటి ప్రణాళిక, క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూడా పట్టణం నేలలోకి కుంగిపోయే ముప్పు నెలకొందని నిపుణులు భావిస్తున్నారు. Unplanned constructions: బీఆర్ఓ నిర్మాణాలు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, జోషి మఠ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ధ ఎత్తున భారీ నిర్మాణాలు చేపడ్తున్నారు. బద్రీనాథ్ కు సుమారు 30 కిమీల ప్రయాణ దూరం తగ్గించే హెలంగ్ బైపాస్ ను Border Roads Organisation (BRO) జోషి మఠ్ కు సమీపం నుంచే నిర్మిస్తోంది. అందుకోసం అక్కడ భారీ మెషీనరీని వాడుతోంది. ముప్పును గుర్తించకుండా, ప్రభుత్వం పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా ఈ ప్రాంతంలో నిర్మిస్తోంది. జోషిమఠ్ కు దాదాపు కిందుగా ఒక టన్నెల్ ను కూడా నిర్మిస్తున్నారు.