త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశభక్తి గీతాలకు, భారతదేశంపై ఉన్న ప్రేమకు పేరుగాంచిన సమీ, ముందుగా మనం భారతీయులమని, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వేర్పాటువాద వైఖరి అనారోగ్యకరమని ( Jagan RRR dispute) చురకలు వేశారు.
జాతీయ స్థాయిలో వివాదం( Jagan in dispute) వాస్తవంగా భారతీయ సినిమాకు ఇది గొప్ప రోజు. టీమ్ RRR గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023లో పెద్ద విజయం సాధించి దేశం గర్వించేలా చేసింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన నాటు నాటు కోసం ఉత్తమ పాట- చలన చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఈ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై చిత్రీకరించిన విషయం విదితమే. ట్విట్టర్ వేదికగా టీమ్ RRR పెద్ద విజయాన్ని జరుపుకుంది. ఈ పాటను ఎం. ఎం. కీరవాణి ఆలపించారు. అధికారిక ప్రకటన తర్వాత, పలువురు ప్రముఖులు ఈ భారీ ఫీట్‌పై SS రాజమౌళి, అతని బృందానికి అభినందనలు తెలిపారు. RRR నటుడు ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో పెద్దగా గెలుపొందడంపై స్పందించారు. అతను RRR లో ఎడ్వర్డ్ అనే బ్రిటిష్ అధికారి పాత్రను పోషించాడు.